అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో
మహనీయులకు మరొక సారి అవమానం
ఆందోళన కారుల చేతిలో పూర్తిగా ధ్వంసమైన విగ్రహాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. కనీసం ఆనవాలు లేకుండా నీటి పాలై, ఆ మహనీయుల పరువు నిలిపాయి.
కాని, ఈ విగ్రహం అత్యంత హేయమైన, నీచమైన, అనాగరికమైన నిర్లక్ష్యానికి గురయ్యింది. మార్చ్ 10 వ తేదీ .. ఇదే విగ్రహం నడి రోడ్డు మీద పడిఉంది. ఆ తర్వాత రెండు రోజులు ట్యాంక్ బండ్ మధ్య మలుపు లో పేవ్ మెంట్ మీద (మెడ కు ఉరి తాడుతో సహా అలాగే) గడిపడం నేను చూసాను. ఆ తర్వాత కొన్ని దిన పత్రికల్లో వచ్చిన విమర్శలతో, ప్రభుత్వ అధికారులు ఈ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణానికి తరలించారు. అక్కడ ఈ ఫోటో లో ఉన్న స్థితి లో, మూత్ర శాలల నడుమ, చాల రోజులనుంచి ఉన్నట్టు ఇది వరకే, ఇంకొక దిన పత్రికలో చదివాను.
మనకు మహనీయుల విగ్రహాలు ఎందుకు? వారికి కనీస గౌరవం ఇవ్వలేని ప్రజలు, ప్రభుత్వాలు ఉన్నంత కాలం మన తెలుగు వెలుగుల గతి ఇంతే. ఇతర భాషల వాళ్ళు, వారి మహనీయులని ఇలాగే "గౌరవిస్తున్నారా"?
మన సాంస్కృతిక శాఖ వారి పని తీరుకు మరొక్క సారి నా జోహార్లు. దయ చేసి మళ్లీ కొత్త విగ్రహాలు చేయించి కొత్త అవమానాలు చేయకండి.