Saturday, March 27, 2010

ఏ మాయ చేసావే - fresh air in hot summer

నిజంగా ఈ సినిమాలో ఒక నిజాయితీ కనిపించింది. అంతే కాకుండా మాటల్లో, పాత్రల ప్రవర్తనలో కొత్తదనం, రొటీన్ ప్రేమ కధల్లో కనిపించే నాటకీయత లేకుండా స్మూత్ గా నడిచిపోయింది. ఎక్కడా విసుగు రాకుండా దర్శకుడు సన్నివేశాలు చాలా బాగా కన్సీవ్ చేసాడు.

నాకు నచ్చిన విషయాలు :
1 . కేరళ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడి విసిగించలేదు.
2 . హీరో మలయాళం వాళ్ళని చితగ్గొట్టి హీరోయిన్ ని ఎత్తుకు పోలేదు.
3 . హీరోయిన్ పిచ్చిగా డాన్స్ చెయ్యలేదు
4 . హీరో డైరెక్ట్ చేసిన మొదటి సినిమాకి ఆస్కార్ వచ్చినట్టు చూపించలేదు.
5 . సున్నితంగా హాండిల్ చేసిన క్లైమాక్స్
6 . నాగ చైతన్య డైలాగ్స్ చెప్పిన తీరు

మరొక విషయం కూడా చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతమైన విలువలతో ఉంది. Especially cinematography capturing scenic beauty in Kerala and USA and at the same time canning the right moods with right lighting. కళ్ళకి ఎంతో ఆహ్లాదంగా ఉంది ఫోటోగ్రఫీ.


నచ్చని విషయాలు:

1 . కొన్ని డైలాగ్స్ మణిరత్నం సినిమాల్లో " పొడి " మాటల్లా ఉన్నాయి.
2 . హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లం ఏమిటి అన్నది ప్రతి ప్రేక్షకుడికీ అర్ధమవ్వక పోవచ్చు. 
    (of course, నాకు కూడా  కొన్ని doubts ఉన్నాయి ). 
3.  నాగ చైతన్య ను కొన్ని సన్నివేశాలలో deglamourised గా చూపించారెందుకో అర్ధం కాదు.

నా దృష్టిలో ఈ సినిమా ఒక landmark గా నిలుస్తుంది ... చాలా కొత్త ప్రయత్నాలకి ఇది ఒక ప్రేరణ గా ఉంటుంది.

1 comment:

Sandeep P said...

మీరు చెప్పినవాటన్నిటితో నేనూ ఏకీభవిస్తాను అండి. హీరో బాక్సర్ అని చెప్పడం ఒకటి నాకు కొంచం commercial element లాగా అనిపించింది. కానీ అలాంటివి ఎంతో కొంత బిలీవబుల్ - మన ఫ్యాక్షన్ సినిమాలకన్నా :)

ఇప్పుడు సమయం ..