Monday, March 22, 2010

మాయాబజార్ created మరో చరిత్ర

మాయాబజార్ 50 రోజులు పూర్తి చేసుకుంది ....

రంగుల్లో మాయాబజార్ మళ్ళీ ప్రేక్షకులని అలరించడం ఆశ్చర్యం కలిగించడం లేదు .. అది ఆ సినిమా గొప్పదనం.

కాని, ఆ రంగుల సృష్టి కర్త (Jaganmohan of Goldstone Technologies) ఈ కళాఖండానికి చేసిన హాని కూడా తక్కువేమీ కాదు. పాటలు, పద్యాలు కొన్ని తీసివెయ్యడం, కొన్ని పాటలు సగమే ఉంచడం, సొంత మ్యూజిక్ తో అసలు సినిమా లో మాధుర్యాన్ని చెడగొట్టడం ఆయన పుణ్యమే!

Though we felt happy watching that masterpiece once again that too in colour, we are totally disappointed with the way the music is redone in a very ordinary standard, by removing the original background score by Ghantasala especially for title music and during second half of the movie.

ఘంటసాల మ్యూజిక్ లో మేజిక్ ని ఇంతటి టెక్నాలజీ ఉన్నా అందుకోలేక పోవడం, ఆ మధుర గాయకుడి /సంగీత దర్శకుడి గొప్పదనాన్నేసూచిస్తుంది.

ఒక టీవీ ఛానల్ లో జగన్మోహన్ ఇంటర్వ్యూ చూసాను. ఆయన ఉద్దేశ్యం ప్రకారం, బ్లాక్  అండ్ వైట్ లో సినిమా తీయడం ఒక ఆర్ట్ కానే కాదని డిసైడ్ అయినట్లుంది.
May be he is unaware of the fact that several film makers have deliberately shot their films in B&W despite availability of colour technology and financial support. e.g.


 
Schindler's List by Speilberg,
Maro Charitra by K Balachander ,
Prema Lekhalu by K Raghavendra Rao,
Seethamalakshmi by K.Viswanath,
Psycho by Alfred Hitchkock,
and also films of Satyajit Ray, Goutham Ghosh.
Can we say that they are not better judges ?

కాని, మాయాబజార్ వీరాభిమానిగా ఆ సినిమా చరిత్ర ను పొడిగించడం, తరువాతి తరానికి అందించడం అనే కారణాల వల్ల జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.


అక్కినేని తన సహజమైన శైలి లో మాట్లాడుతూ మొత్తం క్రెడిట్
ఎస్ వీ రంగారావు, సావిత్రి లకు ఆపాదించారు.

ఈ చిత్రం మళ్ళీ ఎవరైనా తీయాలనుకున్నా ఒక యంగ్ హీరో అభిమన్యుడి పాత్ర కి దొరుకుతాడు కాని, వాళ్ళిద్దరూ దొరకరు కదా అని వ్యాఖ్యానించారు. Hats off to Mr ANR !!

2 comments:

Rajendra Devarapalli said...

good! excellent observations

SRRao said...

వేణుగోపాల్ గారూ !
మాయాబజార్ రంగుల్లో వస్తోందంటే సంబరపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకడిని. టీవీల్లో ప్రోమోలలో కనిపించిన రంగుల మిశ్రమం ఎందుకో నాకు బాగా అనిపించలేదు. ఆ చిత్రం, ముఖ్యంగా మార్కస్ బార్ ట్లే కెమెరా పనితనం అందించిన అనుభూతిని వదులుకోవాలేమోనని భయం వేసి, తర్వాత సంగీతంలో చేసిన మార్పుల గురించి తెలిసాక ఇక చూసే ధైర్యం చెయ్యలేదు.
మీరుదహరించిన ఇంటర్వ్యూ నేను చూడలేదు కానీ... " ఒక టీవీ ఛానల్ లో జగన్మోహన్ ఇంటర్వ్యూ చూసాను. ఆయన ఉద్దేశ్యం ప్రకారం, బ్లాక్ అండ్ వైట్ లో సినిమా తీయడం ఒక ఆర్ట్ కానే కాదని డిసైడ్ అయినట్లుంది " అన్న దాన్ని బట్టి ఆయనకు సినిమా టెక్నాలజీ గురించి సరైన అవగాహన లేదనిపిస్తోంది. కంప్యూటర్ టెక్నాలజీ తెలిసినంత మాత్రాన సర్వం తెలిసినట్లు కాదు. రంగుల్లోనైనా, నలుపు తెలుపుల్లోనైనా సరైన టె్క్నీషియన్ చేతిలో అవి అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకుంటాయి. ఇలాంటి ప్రయోగాలు చేసేవారు ఆ రంగంలో పరిపూర్ణ పరిజ్ఞానాన్ని పొందటంతో బాటు ఆ రంగంలో నిష్ణారులైన వారి సలహా సహకారాలను తీసుకుంటే వారు చేసిన కృషి మాయాబజార్ కీర్తి లాగే చిరకాలం నిలబడుతుంది.

ఇప్పుడు సమయం ..