రోబో ఇప్పటికే ప్రపంచమంతా సంచలనాలు సృష్టిస్తోంది... కొత్తగా చెప్పడానికి ఏమి లేకుండా వ్యూలు, రివ్యూలు వచ్చేశాయి.
కాని నా కంటితో చూసి నా సొంత రివ్యూ రాస్తే ఎలా వుంటుంది అనుకున్నా. అది ఇలా ఉంది.
రోబో కి స్వంత తెలివి, ఆలోచన, విచక్షణ, స్పందన, సందర్భోచిత ప్రవర్తన ఉండవు కాబట్టి అవి ఎన్నటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేవు... ఒక వేళ అటువంటి తెలివిని వాటిలో ప్రవేశ పెట్టినా ఆ ప్రయత్నం వినాశనానికి దారి తియ్యొచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పనిలో పనిగా మనుషుల్లో కూడా తెలివి వికటిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని దర్శకుడు కన్వే చేసాడు. తనను సృష్టించిన "దేవుడికి" ద్రోహం చెయ్యడానికి ఒక రోబో ప్రయత్నం, అందువల్ల కలిగిన విధ్వంసం, హీరో తన సృష్టిని తన నియంత్రణ లోకి ఎలా తెస్తాడు అనే విషయాలను దర్శకుడు తన ప్రతిభ, సాంకేతిక నిపుణుల సామర్ధ్యం, నటీనటుల నట పాటవం తో ఎంతో అందంగా భారీ గా తెరకి ఎక్కించాడు.
ఇంతకంటే వివరాలు మీకు చెప్పకుండా డైరెక్ట్ గా విషయానికొస్తే ...
రోబో మూవీ రజనికాంత్ తప్ప వేరొకరు చేస్తే ? సినిమాలో ఈ రకమైన ఫీల్ ఉండేది కాదు. ఇంత డిమాండ్ ప్రపంచమంతా ఉండేది కాదు. ఇంత ఖర్చుకు తగ్గ రాబడి పూర్తిగా అనుమానమే !! అందుకే, ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్.
ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్ |
రెహ్మాన్ సంగీతం : అంత గొప్పగా లేదు. సినిమా స్థాయికి తగ్గ పాటలు, BG మ్యూజిక్ లేవు.
సాంకేతికంగా ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. భారతీయ సినిమాల స్టాండర్డ్ ప్రకారం ఇందులో చూపిన గ్రాఫిక్స్, టెక్నిక్, మిక్సింగ్ ఎంతో ఉన్నత స్థాయి లో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరింది. కానీ Terminator 2 , I Robo లాంటి సినిమాలు చుసిన వాళ్లకు మనం ఇంకా చాలా వెనక బడినట్టు అనిపించడం సహజం.
మొత్తానికి రజని presence , హ్యూమన్ టచ్ , కళ్ళు మిరుమిట్లు కొలిపే గ్రాఫిక్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి.
Verdict : ఒక సారి చూడొచ్చు.
2 comments:
సినిమా మీరన్నట్లు బాగుంది. కాని పాటలే ఒక్కటి బాగా లేవు. అంత ఖర్చు పెట్టి తీసిన , మనకి ఒక్క పాటన్న గుర్తుండే విధంగా లేదు. చివర సీన్ మాత్రం కళ్ళు చెమర్చాయి.
పాటలు చాలామంది బాగులేవని రాసారు. నేను తెలుగు పాటలు వినలేదు. మూవీ హిందీలో చూసాను. హిందీ పాటలు మొదటిసారి వినడానికి బాగులేకపోయినా, వినగా వినగా రెండు-మూడు పాటలు బాగున్నాయనిపించాయి (నైనా మిలే, సనా సనా, కిల్లిమాంజారో) . మూవీ మాత్రం ఒక్కసారైనా చూడాలి - రజ్‌నీ 'పంఖా' కాకపోయిన సరే.
Post a Comment