తెలుగు భాషాభిమానులకు చాలా సంతోషకరమైన వార్త
ఈనాడు వారి "తెలుగు వెలుగు" మాస పత్రిక తాజా సంచికలో వచ్చిన " అమ్మ సిగలో మరో కలికితురాయి " అనే కథనం ప్రకారం:
ఇటీవల ( 2012 అక్టోబర్ 1 నుంచి 4 వరకు ) థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన "రెండవ ప్రపంచ లిపుల సదస్సు" లో మన తెలుగు లిపి "ద్వితీయ ఉత్తమ లిపి" గా ఎంపిక అయింది. మొదటి స్థానం కొరియా భాషకు వచ్చింది.
ముప్పై మూడు దేశాల నుంచి ప్రతినిధులు అనేక భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇందులో పాల్గొనగా మన తెలుగు భాష కు ప్రతినిధి గా మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ (డాక్టర్) మాడభూషి సంపత్ కుమార్ హాజరయ్యారు.
మన లిపి కి ఈ పురస్కారం రావడానికి కారణాలు:
- సౌకర్యవంతమైన లిపి.
- ఉచ్ఛారణ విధేయత
- వీలైనన్ని ధ్వనులను రాయడానికి గల సామర్ధ్యం.
- నేర్చుకోవడం సులభం.
- అందమైన లిపి.
ఐతే మనం మొదటి స్థానం సంపాదించక పోవడానికి కారణం " ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి అనుకూలంగా లేకపోవడం" అని, ఆ కారణంగానే కొరియా భాష మొదటి స్థానం సాధించింది అని అర్ధమవుతుంది.
ఏది ఏమైనా ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ విషయాన్ని మనం తగినంత ప్రచారంతో ప్రజలలోకి తీసుకు వెళితే
కొత్త తరంలోని తెలుగు వారికి భాష నేర్చుకోవడానికి, రాయడానికి స్ఫూర్తి కలిగిస్తుందేమో.
ఈ లింకు చూడండి :
http://rki.kbs.co.kr/english/news/news_zoom_detail.htm?No=6901
2 comments:
అడ్డడే,
ప్రక్కనున్న అరవ రాష్ట్రం అరవోడు విదేశాలకి వెళ్లి చెప్పేంత దాక ఈ ముక్క మనకు తెలీకుండా పోయెనే!
'టెల్గూ' మహా సభల్లో ఈ 'ముక్క' గురించి అసలు ఎవరూ చెప్పలేదేమిస్మీ ?
ఆంధ్రా పత్రికోడు ఓ బాక్స్ ఐటేమైనా పెట్టేడు సంతోషించాలేమో మరి!
జిలేబి.
జిలేబీ గారూ
అరవ దేశం అరవోడు కాదండీ - అరవదేశంలో ఉన్న అస్సలైన తెలుగు వాడు శ్రీ (డాక్టర్) మాడభూషి సంపత్ కుమార్ గారు .
ఈ విషయాన్ని పత్రికలకి చేరవేసినట్లే మాడభూషి సంపత్ కుమార్ గారు ప్రపంచ తెలుగు మహాసభలకి తెలిపి ఉంటే బాగుండేది
Post a Comment