NTR తో ఏక చిత్ర నాయిక
Wednesday, February 20, 2013
Monday, February 11, 2013
అక్కినేని విజయ రహస్యాలు
ఈ రోజు ఆంద్ర జ్యోతి లో వచ్చిన ఈ జ్ఞాపకాల దొంతర అక్కినేని జీవితంలో సాధించిన విజయాలకు కారణాలు విశదీకరిస్తుంది.....తప్పక చదవండి.
మన శ్రమే మన తలరాత అంటారు
చదువుల బడిలో అక్షరాలు దిద్దకున్నా విశాల ప్రపంచాన్నే విశ్వవిద్యాలయంగా భావించి, అందులోనే తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న మహానటులు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్నో గౌరవ డాక్టరేట్లు, పద్మవిభూషణ్ లాంటి ప్రభుత్వ పురస్కారాలు, సినిమా రంగానికి చెందిన అత్యున్నతమైన దాదా ఫాల్కే పురస్కారం అందుకున్న ఆయన ఇంట్లో, పిల్లలతో ఎలా ఉండేవారు? మరో ఏడాదిలో 90 వసంతాలు చేరుకోనున్న ఆయన నుండి ఆయన పిల్లలు ఏం నేర్చుకున్నారు? వాటి గురించి ప్రముఖ సినీ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన పెద్దకుమారుడు అక్కినేని వెంకట్ చెప్పిన విశేషాలే ఈ వారం 'నాన్న-నేను'.
"చిన్నప్పుడు చిక్కటి పెరుగు తాగే అలవాటు ఉండేది నాకు. గ్లాసుల కొద్దీ తాగేవాణ్ణి. దానికి తోడు బుగ్గలకు మెరుపొస్తుందని, చర్మం నిగనిగలాడుతుందని ఎవరైనా చెప్పారో లేక సొంత వైద్యమో తెలియదు కాని నాన్నగారు ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి...రెండు పూటలా వెన్నముద్దలను కప్పులో వేసుకుని తినేవారు. తను తినడమే కాదు నాక్కూడా తినిపించడం అలవాటు చేశారు. దీంతో మా ఇద్దరికీ చర్మానికి మెరుపు మాట అటుంచి వొంట్లో కొవ్వు పేరుకుపోయింది. అదే నాన్నగారికి గుండె జబ్బును తెచ్చిపెట్టింది. నాన్నగారికి మొదటిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు నాకు 20 ఏళ్లు. ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. మా అమ్మ, మేము ఇక్కడే ఉండిపోయాం. నాన్నగారి వెంట పిఎపి అధినేత ఎ.వి. సుబ్బారావుగారు వెళ్లారు. "నాకేమీ కాదు..అమ్మను చూసుకుంటూ ఇక్కడే ఉండు'' అని నాకు చెప్పి నాన్నగారు బయల్దేరారు. డీలాపడిన అమ్మకు ధైర్యం చెప్పే బాధ్యత పెద్దకుమారుడిగా నేను తీసుకున్నాను.
అమెరికాలో కూడా అప్పుడే(1974) కొత్తగా ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్‌కు ముందు రోజు రాత్రి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పేషెంట్‌కు సెడేటివ్స్(నిద్ర మాత్రలు) తప్పనిసరిగా ఇస్తారు. నాన్నగారికి కూడా ఒక అమెరికన్ నర్సు ఆ మాత్రలు చేతిలో పెట్టింది. "ఆపరేషన్ గురించి నేనేం భయపడడం లేదు. కాబట్టి హ్యాపీగా నిద్రపోతాను. ఈ మాత్రలు వేసుకోవలసిన అవసరం నాకు లేదు'' అంటూ వాటిని వేసుకోనంటూ నాన్నగారు భీష్మించుకు కూర్చున్నారు. వేసుకోనంత వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని ఆ నర్సు కూడా మొండికేసింది. దీంతో నాన్నగారు ఆ మాత్రలను నోట్లో వేసుకుని మింగకుండా దవడలో దాచేసి నీళ్లు తాగినట్లు నటించారు. నాన్నగారు మహానటులన్న విషయం తెలియని ఆ నర్సు నమ్మేసి తన మాట విన్నందుకు ఆనందిస్తూ వెళ్లిపోయింది. ఆమె అటు వెళ్లిన మరుక్షణం వాటిని ఊసేసారు ఆయన.
"ఆపరేషన్ చేసే డాక్టర్లకు భయం ఉండవచ్చేమో కాని నాకెందుకు భయం?'' అంటూ ఆయన «హాయిగా నిద్రపోయారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మూడు వారాల తర్వాత బయల్దేరి ఇండియా వచ్చేశారు. మొదటి నుంచి నాన్నగారికి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో చేసే పిండి వంటలంటే చాలా ప్రీతి. ఆపరేషన్ తర్వాత ఆ ఇష్టాలన్నీ వదిలేసుకున్నారు. అంతకుముందు వరకు రోజుకు నాలుగైదు పెట్టెల సిగరెట్లను తాగేవారాయన. ఆ తర్వాత అటు వైపు చూస్తే ఒట్టు. ఆ రోజు నుంచి నేను కూడా పెరుగు, వెన్నకు గుడ్‌బై చెప్పేశాను.
నాన్నకు కోపమొస్తే...
నేను పుట్టింది మద్రాసులో. మూడవ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. నా ఎనిమిదవ ఏట 1960లో నాన్నగారు హైదరాబాద్‌కు తరలిరావడంతో మేమంతా కూడా ఇక్కడకు వచ్చేశాము. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క సత్యవతి(దివంగతులయ్యారు). నేను రెండవవాణ్ణి. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు సుశీల, సరోజ. ఆఖరువాడు నాగార్జున. నాకు ఊహ వచ్చేసరికే నాన్నగారు పెద్ద హీరో. చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ వారం పదిరోజులకో ఓసారి ఆయనను చూసేవాళ్లం. మేము లేచేసరికి ఆయన వెళ్లిపోయేవారు. ఆయన వచ్చేసరికి మేము నిద్రపోయేవాళ్లం. అయితే ప్రతి వేసవి సెలవులకు మాత్రం కొడైకెనాల్, ఊటీ.. ఇలా ఏదో ఒక హిల్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఓ పది రోజులు షూటింగ్ పెట్టుకునే వారు. మిగిలిన రోజులు షూటింగ్‌కు దూరంగా మాతోనే గడిపేవారు. అమ్మానాన్నలు ఎంత సరదాగా ఉంటారంటే హైదరాబాద్‌లో చూసే నాన్నేనా అని మాకు అనిపించేది. నిజం చెప్పాలంటే నాన్నగారితో గడిపే ఆ సెలవుల కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. ఆ సెలవులు గడిచిపోతే ఆయనను చూసే అవకాశం మళ్లీ అలా ఎక్కడ దొరకదని దిగాలుపడేవాళ్లం.
నాన్నగారు ఇంట్లో ఉండడం తక్కువ కాబట్టి మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఆయన ఇంటి పట్టున ఉన్న రోజున మా అమ్మగారు ఫిర్యాదుల చిట్టా ఇచ్చేది. దాంతో కొందరికి చీవాట్లు...మరి కొందరికి బడితపూజ...ఇలా ఎవరి కోటా వాళ్లకు అందచేసేవారు. చిన్నప్పుడు నాన్నగారితో మాకు సాన్నిహిత్యం చాలా తక్కువ కాబట్టి ఆయనంటే మాకు విపరీతమైన భయంగా ఉండేది. అయితే పెరిగే కొద్దీ ఆ భయం పోయింది. మేము చెప్పింది శ్రద్ధగా వినడం, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చేసేవారు. తాను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నది నాన్నగారికి బలంగా ఉండేది. 1950వ దశకంలో నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ 45 వేలు ఉందట. అందులోనుంచే 25 వేల రూపాయలను ఆంధ్రా యూనివర్సిటీకి విరాళంగా అందచేశారంటే నాన్నగారికి చదువు పట్ల ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.
రైతుబిడ్డగానే ఇప్పటికీ...
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాన్నగారికి తోటలు పెంచడమన్నా, వ్యవసాయం చేయడమన్నా చాలా ఇష్టం.ముఖ్యంగా కూరగాయలు పండించడమంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఆయన ఇష్టాన్ని గమనించి, ఆయనకూ ఉపయోగకరంగా ఉంటుందని నేనే పాతికేళ్ల క్రితం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నాను. ఆ తోటలకు వెళ్లడం నాన్నగారు ఒక వ్యాపకంగా చేసుకున్నారు. తనకు ఇష్టమైన కూరగాయలను, పండ్లను ఆయనే పండించుకుంటారు. ఇంట్లో కూడా పెద్ద కూరగాయల తోటనే నాన్నగారు పండిస్తున్నారు. నాన్నగారికి పుస్తక పఠనమంటే కూడా చాలా ఇష్టం. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనది. మహాకవి కాళిదాసు సాహిత్యం, పురాణాలు బాగా చదువుతారు. ఆ పద్యాలన్నీ ఆయనకు కంఠోపాఠమే. మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మొదటి నుంచి లేదు. నాన్నగారు వృత్తినే దైవంగా భావించారు తప్ప ప్రత్యేకంగా పూజలు, దైవభక్తి లాంటివి ఆయనకు లేవు. నాదీ అదే పద్ధతి. మా ఇంట్లో మతపరమైన వేడుకలు, పండుగలు లాంటివి ఏవీ ప్రత్యేకంగా జరుపుకోము. పండుగలకు ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు ఏవీ మా ఇంట్లో ఉండవు. అలాగే గుళ్లు, గోపురాలను సందర్శించడం కూడా అరుదు. నాగార్జున మాత్రం 'అన్నమయ్య' సినిమా తర్వాత కొంత ఆధ్యాత్మిక చింతనలో పడ్డాడు.
స్థితప్రజ్ఞత
మా అమ్మగారు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెను కంటికి రెప్పలా నాన్నగారు చివరి క్షణం వరకు చూసుకున్నారు. మా అమ్మగారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలిసినపుడు ఆయన కృంగిపోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నారు. మేము దిగులు చెందుతుంటే ధైర్యం చెప్పే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. "ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. మీ అమ్మ మనల్నందరినీ వదిలి వెళ్లిపోతోంది...మీరంతా నిబ్బరంగా ఉండాలి..తట్టుకుని నిలబడాలి'' అంటూ మమ్మల్ని ఓదార్చారు. మా అమ్మానాన్నలది దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన జీవిత భాగస్వామ్యం. అన్యోన్య దాంపత్యం. వారిద్దరు పరస్పరం కలహించుకోవడం నా జీవితంలో చూడలేదు. అమ్మంటే నాన్నగారికి అంతులేని ప్రేమ. అమ్మ దూరమైన బాధను ఆయన ఏనాడూ వ్యక్తం చేయలేదు. అమ్మ లేని లోటు తెలియకుండా ఉండేందుకు కాబోలు తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు.
ఇప్పటికీ నాన్నగారు క్షణం తీరికలేకుండా గడుపుతుంటారు. బోరు కొడుతోంది అన్న మాట ఆయన డిక్షనరీలోనే లేదు. నాన్నగారు మూఢనమ్మకాలకు పూర్తి వ్యతిరేకం. వాస్తు, జాతకాలు, ముహూర్తాలు లాంటివాటిని ఆయన నమ్మరు. మన కష్టమే మన తలరాత అని నమ్మే వ్యక్తి ఆయన. నిజాయితీ, నీతి, న్యాయం, ధర్మం...ఇవే నాన్నగారు పాటిస్తున్న సూత్రాలు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలన్నది నాన్నగారి సిద్ధాంతం. అలా జీవించడం ఆయనకే సాధ్యమవుతోంది''.
నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించినప్పుడు నేను విదేశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో నాన్నగారికి షూటింగ్‌లు చేసుకోవడానికి హైదరాబాద్‌లో స్టూడియో లేకుండా పోయింది. సారథి స్టూడియోస్ ఉన్నప్పటికీ అది నష్టాలలో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండేది. ఆయన నటజీవితాన్ని కొనసాగించాలంటే బెంగుళూరుకో, మద్రాసుకో వెళ్లక తప్పదు. ఆ దశలో సొంతంగా తానే స్టూడియో నిర్మించాలన్న ఆలోచన నాన్నగారికి వచ్చింది. అప్పుడే నేను మద్రాసు లయోలా కాలేజ్‌లో బిఎ పూర్తి చేసి పైచదువుల కోసం విదేశాలకు వెళుతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన చేసిన రోజున ఉన్నాను...రెండేళ్ల తర్వాత నేను చదువు ముగించుకుని వచ్చేసరికి స్టూడియో రెండు ఫ్లోర్లు పూర్తయిపోలయింది. స్టూడియో నిర్మాణమంతా నాన్నగారు ఒంటి చేత్తో చేశారనే చెప్పవచ్చు. ఆ తర్వాత నాన్నగారి నుంచి ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను.
నాకు కాని, మా తమ్ముడు నాగార్జునకు కాని మొదటి నుంచి సినిమా రంగంపట్ల ఆసక్తి లేదు. మేము ఈ రంగంలోకి వస్తామని మేము ఏనాడూ ఊహించలేదు కూడా. ఒక దశలో అన్నపూర్ణ స్టూడియోస్ వరుస నష్టాలను అనుభవిస్తోంది. అప్పటికే నాన్నగారు సినిమాలు నిర్మించడం మానేశారు. స్టూడియో ఆర్థికంగా నిలబడాలంటే మేము సినిమాలు తీయక తప్పదని నిర్ణయించుకున్నాం. అలా నేను నిర్మాతగా, నాగార్జున నటుడిగా ఈ రంగంలోకి ప్రవేశించాము. నిర్మాతగానే కాక దర్శకత్వానికి సంబంధించి అన్ని రంగాలలో కూడా అనుభవం గడించాను. నాగార్జున నటించిన 'రక్షణ' చిత్రానికి నా పేరు వేసుకోకపోయినా దర్శకత్వం దాదాపు నేనే చేశాను. నా అభిరుచికి, ఆలోచనలకు అనుగుణంగా ఒక్క చిత్రానికి దర్శకత్వం చేయలేదన్న అసంతృప్తి ఇప్పటికీ నన్ను వేధిస్తోంది.
అజాత శత్రువు నాన్న
నాన్నగారికి చిత్రరంగంలో చాలా మంది మంచి మిత్రులు ఉండేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు నాన్నగారికి మార్గదర్శి అని చెప్పాలి. అలాగే నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారు, ఆయన సోదరుడు కృష్ణప్రసాద్‌గారు నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. మా అమ్మగారికి వరుసకు సోదరుడైన స్వర్గీయ కొడాలి వెంకటేశ్వరరావుగారు నాన్నగారికి అత్యంత ఆత్మీయులు. ఇక శివాజీగణేశన్‌గారు, నాన్నగారైతే చిన్ననాటి స్నేహితుల్లాగా 'ఏరా', 'ఒరేయ్' అని పిలుచుకునేవారు. శివాజీగారు హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా మా ఇంట్లో దిగాల్సిందే. అలాగే నాన్నగారు మద్రాసు వెళితే వాళ్లింటికే నేరుగా వెళ్లేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు, వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి కుటుంబాలతో మా అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.
"చిన్నప్పుడు చిక్కటి పెరుగు తాగే అలవాటు ఉండేది నాకు. గ్లాసుల కొద్దీ తాగేవాణ్ణి. దానికి తోడు బుగ్గలకు మెరుపొస్తుందని, చర్మం నిగనిగలాడుతుందని ఎవరైనా చెప్పారో లేక సొంత వైద్యమో తెలియదు కాని నాన్నగారు ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి...రెండు పూటలా వెన్నముద్దలను కప్పులో వేసుకుని తినేవారు. తను తినడమే కాదు నాక్కూడా తినిపించడం అలవాటు చేశారు. దీంతో మా ఇద్దరికీ చర్మానికి మెరుపు మాట అటుంచి వొంట్లో కొవ్వు పేరుకుపోయింది. అదే నాన్నగారికి గుండె జబ్బును తెచ్చిపెట్టింది. నాన్నగారికి మొదటిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు నాకు 20 ఏళ్లు. ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. మా అమ్మ, మేము ఇక్కడే ఉండిపోయాం. నాన్నగారి వెంట పిఎపి అధినేత ఎ.వి. సుబ్బారావుగారు వెళ్లారు. "నాకేమీ కాదు..అమ్మను చూసుకుంటూ ఇక్కడే ఉండు'' అని నాకు చెప్పి నాన్నగారు బయల్దేరారు. డీలాపడిన అమ్మకు ధైర్యం చెప్పే బాధ్యత పెద్దకుమారుడిగా నేను తీసుకున్నాను.
అమెరికాలో కూడా అప్పుడే(1974) కొత్తగా ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్‌కు ముందు రోజు రాత్రి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పేషెంట్‌కు సెడేటివ్స్(నిద్ర మాత్రలు) తప్పనిసరిగా ఇస్తారు. నాన్నగారికి కూడా ఒక అమెరికన్ నర్సు ఆ మాత్రలు చేతిలో పెట్టింది. "ఆపరేషన్ గురించి నేనేం భయపడడం లేదు. కాబట్టి హ్యాపీగా నిద్రపోతాను. ఈ మాత్రలు వేసుకోవలసిన అవసరం నాకు లేదు'' అంటూ వాటిని వేసుకోనంటూ నాన్నగారు భీష్మించుకు కూర్చున్నారు. వేసుకోనంత వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని ఆ నర్సు కూడా మొండికేసింది. దీంతో నాన్నగారు ఆ మాత్రలను నోట్లో వేసుకుని మింగకుండా దవడలో దాచేసి నీళ్లు తాగినట్లు నటించారు. నాన్నగారు మహానటులన్న విషయం తెలియని ఆ నర్సు నమ్మేసి తన మాట విన్నందుకు ఆనందిస్తూ వెళ్లిపోయింది. ఆమె అటు వెళ్లిన మరుక్షణం వాటిని ఊసేసారు ఆయన.
"ఆపరేషన్ చేసే డాక్టర్లకు భయం ఉండవచ్చేమో కాని నాకెందుకు భయం?'' అంటూ ఆయన «హాయిగా నిద్రపోయారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మూడు వారాల తర్వాత బయల్దేరి ఇండియా వచ్చేశారు. మొదటి నుంచి నాన్నగారికి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో చేసే పిండి వంటలంటే చాలా ప్రీతి. ఆపరేషన్ తర్వాత ఆ ఇష్టాలన్నీ వదిలేసుకున్నారు. అంతకుముందు వరకు రోజుకు నాలుగైదు పెట్టెల సిగరెట్లను తాగేవారాయన. ఆ తర్వాత అటు వైపు చూస్తే ఒట్టు. ఆ రోజు నుంచి నేను కూడా పెరుగు, వెన్నకు గుడ్‌బై చెప్పేశాను.
నాన్నకు కోపమొస్తే...
నేను పుట్టింది మద్రాసులో. మూడవ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. నా ఎనిమిదవ ఏట 1960లో నాన్నగారు హైదరాబాద్‌కు తరలిరావడంతో మేమంతా కూడా ఇక్కడకు వచ్చేశాము. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క సత్యవతి(దివంగతులయ్యారు). నేను రెండవవాణ్ణి. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు సుశీల, సరోజ. ఆఖరువాడు నాగార్జున. నాకు ఊహ వచ్చేసరికే నాన్నగారు పెద్ద హీరో. చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ వారం పదిరోజులకో ఓసారి ఆయనను చూసేవాళ్లం. మేము లేచేసరికి ఆయన వెళ్లిపోయేవారు. ఆయన వచ్చేసరికి మేము నిద్రపోయేవాళ్లం. అయితే ప్రతి వేసవి సెలవులకు మాత్రం కొడైకెనాల్, ఊటీ.. ఇలా ఏదో ఒక హిల్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఓ పది రోజులు షూటింగ్ పెట్టుకునే వారు. మిగిలిన రోజులు షూటింగ్‌కు దూరంగా మాతోనే గడిపేవారు. అమ్మానాన్నలు ఎంత సరదాగా ఉంటారంటే హైదరాబాద్‌లో చూసే నాన్నేనా అని మాకు అనిపించేది. నిజం చెప్పాలంటే నాన్నగారితో గడిపే ఆ సెలవుల కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. ఆ సెలవులు గడిచిపోతే ఆయనను చూసే అవకాశం మళ్లీ అలా ఎక్కడ దొరకదని దిగాలుపడేవాళ్లం.
రైతుబిడ్డగానే ఇప్పటికీ...
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాన్నగారికి తోటలు పెంచడమన్నా, వ్యవసాయం చేయడమన్నా చాలా ఇష్టం.ముఖ్యంగా కూరగాయలు పండించడమంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఆయన ఇష్టాన్ని గమనించి, ఆయనకూ ఉపయోగకరంగా ఉంటుందని నేనే పాతికేళ్ల క్రితం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నాను. ఆ తోటలకు వెళ్లడం నాన్నగారు ఒక వ్యాపకంగా చేసుకున్నారు. తనకు ఇష్టమైన కూరగాయలను, పండ్లను ఆయనే పండించుకుంటారు. ఇంట్లో కూడా పెద్ద కూరగాయల తోటనే నాన్నగారు పండిస్తున్నారు. నాన్నగారికి పుస్తక పఠనమంటే కూడా చాలా ఇష్టం. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనది. మహాకవి కాళిదాసు సాహిత్యం, పురాణాలు బాగా చదువుతారు. ఆ పద్యాలన్నీ ఆయనకు కంఠోపాఠమే. మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మొదటి నుంచి లేదు. నాన్నగారు వృత్తినే దైవంగా భావించారు తప్ప ప్రత్యేకంగా పూజలు, దైవభక్తి లాంటివి ఆయనకు లేవు. నాదీ అదే పద్ధతి. మా ఇంట్లో మతపరమైన వేడుకలు, పండుగలు లాంటివి ఏవీ ప్రత్యేకంగా జరుపుకోము. పండుగలకు ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు ఏవీ మా ఇంట్లో ఉండవు. అలాగే గుళ్లు, గోపురాలను సందర్శించడం కూడా అరుదు. నాగార్జున మాత్రం 'అన్నమయ్య' సినిమా తర్వాత కొంత ఆధ్యాత్మిక చింతనలో పడ్డాడు.
స్థితప్రజ్ఞత
మా అమ్మగారు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెను కంటికి రెప్పలా నాన్నగారు చివరి క్షణం వరకు చూసుకున్నారు. మా అమ్మగారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలిసినపుడు ఆయన కృంగిపోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నారు. మేము దిగులు చెందుతుంటే ధైర్యం చెప్పే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. "ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. మీ అమ్మ మనల్నందరినీ వదిలి వెళ్లిపోతోంది...మీరంతా నిబ్బరంగా ఉండాలి..తట్టుకుని నిలబడాలి'' అంటూ మమ్మల్ని ఓదార్చారు. మా అమ్మానాన్నలది దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన జీవిత భాగస్వామ్యం. అన్యోన్య దాంపత్యం. వారిద్దరు పరస్పరం కలహించుకోవడం నా జీవితంలో చూడలేదు. అమ్మంటే నాన్నగారికి అంతులేని ప్రేమ. అమ్మ దూరమైన బాధను ఆయన ఏనాడూ వ్యక్తం చేయలేదు. అమ్మ లేని లోటు తెలియకుండా ఉండేందుకు కాబోలు తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు.
ఇప్పటికీ నాన్నగారు క్షణం తీరికలేకుండా గడుపుతుంటారు. బోరు కొడుతోంది అన్న మాట ఆయన డిక్షనరీలోనే లేదు. నాన్నగారు మూఢనమ్మకాలకు పూర్తి వ్యతిరేకం. వాస్తు, జాతకాలు, ముహూర్తాలు లాంటివాటిని ఆయన నమ్మరు. మన కష్టమే మన తలరాత అని నమ్మే వ్యక్తి ఆయన. నిజాయితీ, నీతి, న్యాయం, ధర్మం...ఇవే నాన్నగారు పాటిస్తున్న సూత్రాలు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలన్నది నాన్నగారి సిద్ధాంతం. అలా జీవించడం ఆయనకే సాధ్యమవుతోంది''.
నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించినప్పుడు నేను విదేశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో నాన్నగారికి షూటింగ్‌లు చేసుకోవడానికి హైదరాబాద్‌లో స్టూడియో లేకుండా పోయింది. సారథి స్టూడియోస్ ఉన్నప్పటికీ అది నష్టాలలో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండేది. ఆయన నటజీవితాన్ని కొనసాగించాలంటే బెంగుళూరుకో, మద్రాసుకో వెళ్లక తప్పదు. ఆ దశలో సొంతంగా తానే స్టూడియో నిర్మించాలన్న ఆలోచన నాన్నగారికి వచ్చింది. అప్పుడే నేను మద్రాసు లయోలా కాలేజ్‌లో బిఎ పూర్తి చేసి పైచదువుల కోసం విదేశాలకు వెళుతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన చేసిన రోజున ఉన్నాను...రెండేళ్ల తర్వాత నేను చదువు ముగించుకుని వచ్చేసరికి స్టూడియో రెండు ఫ్లోర్లు పూర్తయిపోలయింది. స్టూడియో నిర్మాణమంతా నాన్నగారు ఒంటి చేత్తో చేశారనే చెప్పవచ్చు. ఆ తర్వాత నాన్నగారి నుంచి ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను.
నాకు కాని, మా తమ్ముడు నాగార్జునకు కాని మొదటి నుంచి సినిమా రంగంపట్ల ఆసక్తి లేదు. మేము ఈ రంగంలోకి వస్తామని మేము ఏనాడూ ఊహించలేదు కూడా. ఒక దశలో అన్నపూర్ణ స్టూడియోస్ వరుస నష్టాలను అనుభవిస్తోంది. అప్పటికే నాన్నగారు సినిమాలు నిర్మించడం మానేశారు. స్టూడియో ఆర్థికంగా నిలబడాలంటే మేము సినిమాలు తీయక తప్పదని నిర్ణయించుకున్నాం. అలా నేను నిర్మాతగా, నాగార్జున నటుడిగా ఈ రంగంలోకి ప్రవేశించాము. నిర్మాతగానే కాక దర్శకత్వానికి సంబంధించి అన్ని రంగాలలో కూడా అనుభవం గడించాను. నాగార్జున నటించిన 'రక్షణ' చిత్రానికి నా పేరు వేసుకోకపోయినా దర్శకత్వం దాదాపు నేనే చేశాను. నా అభిరుచికి, ఆలోచనలకు అనుగుణంగా ఒక్క చిత్రానికి దర్శకత్వం చేయలేదన్న అసంతృప్తి ఇప్పటికీ నన్ను వేధిస్తోంది.
నాన్నగారికి చిత్రరంగంలో చాలా మంది మంచి మిత్రులు ఉండేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు నాన్నగారికి మార్గదర్శి అని చెప్పాలి. అలాగే నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారు, ఆయన సోదరుడు కృష్ణప్రసాద్‌గారు నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. మా అమ్మగారికి వరుసకు సోదరుడైన స్వర్గీయ కొడాలి వెంకటేశ్వరరావుగారు నాన్నగారికి అత్యంత ఆత్మీయులు. ఇక శివాజీగణేశన్‌గారు, నాన్నగారైతే చిన్ననాటి స్నేహితుల్లాగా 'ఏరా', 'ఒరేయ్' అని పిలుచుకునేవారు. శివాజీగారు హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా మా ఇంట్లో దిగాల్సిందే. అలాగే నాన్నగారు మద్రాసు వెళితే వాళ్లింటికే నేరుగా వెళ్లేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు, వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి కుటుంబాలతో మా అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.
టి.సుధాకర్ ఫోటో : రాజ్‌కుమార్
Thanks to : Andhra Jyothi Daily
Friday, February 8, 2013
అన్నమయ్య - వేటూరి
అన్నమయ్య ను మనకు పరిచయం చేసిన మహానుభావుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి చదివారా?
ఈ క్రింది లింకు నొక్కండి.
Sunday, February 3, 2013
కే విశ్వనాథ్ గురించి అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఏమన్నారు ?

http://tkvgp.blogspot.in/2013/02/style.html
పై లింక్ చూడండి.

Saturday, February 2, 2013
స్టైల్ (style) కూడా ఒక రకంగా స్వీయ భావ తస్కరణే !!

STYLE IS SELF PLAGIARISM !!
![]() |
| ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ |
వాళ్ళు ఆ పాత సృజన కు ఎంతగా అతుక్కు పోతారంటే అదే పధ్ధతి (మూస), ఆలోచన
ఎలాంటి కొత్త సమస్యలకైనా, సంఘటనలకైనా, సరిపోతుందని భావిస్తారు.
అంతేకాదు ఇకముందు అంతకంటే మెరుగైన సృజనాత్మకత లేదా ఆలోచన తమకు రాదని కూడా భయపడుతుంటారు.
- ఈ మాటలన్నది ప్రఖ్యాత హాలివుడ్ దర్శకుడు "ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్".
Style is Self-Plagiarism.
Many people do something great at a given point in their careers and are forever influenced by that event,either thinking they have found the creative solution that works for all situations or fearful that they’ll never have such a big idea again.
ఆశ్చర్యం ... ఈ సిద్ధాంతం మన వాళ్ళ కు ఎంత అతికినట్టు సరిపోతుందో!
కే. విశ్వనాధ్ - ఎంత గొప్ప దర్శకుడు? ఆయన తీసిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
దాసరి , రాఘవేంద్ర రావు, బాపు - వీళ్ళు తెలుగు వారినే కాదు ఇతర భాషల ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్న ఉత్తమ చిత్రాలు తీశారు.
రామ్ గోపాల్ వర్మ - ఒక తరం యువతరం అంతా ఆయన అభిమానులే ! శివ సినిమా ఒక్కటి చాలు కదా.
ఇక విషయానికొస్తే, పైన చెప్పిన దర్శకులు అందరూ తమ తమ విజయవంతమైన, నిరూపితమైన ( proven ) శైలి (style) లో నుంచి బయటకు రాలేక అదే మూసలో సినిమాలు తీస్తూ వారిని అభిమానించే వారి చేతనే తిరస్కరణ కు గురవుతున్నారు. వీళ్ళు ఇప్పటికీ అంతే ప్రతిభావంతులు కానీ వారి ప్రయత్నాలు మనల్ని ఆకట్టుకోవడం లేదు ఎందుకంటే వారు వారి స్వంత మూసలోంచి బయటకు రాకపోవడమే.
ఇలాంటప్పుడే థింక్ డిఫరెంట్ (ఈ బ్లాగు పేరు) అనే మాట పనికొస్తుంది.
ఉదాహరణకు : విశ్వనాథ్ గారు " బిజినెస్ మెన్"
దాసరి గారు " కేమెరమేన్ గంగ తో రాంబాబు"
రాఘవేంద్ర రావు గారు " సీతమ్మ వాకిట్లో ..."
రాంగోపాల్ వర్మ గారు " అలా మొదలైంది"
బాపు గారు " రాజన్న"
సినిమాలకు పనిచేసి ఉంటే ఎంత కొత్తరకంగా ఉండేవో ఊహించండి.
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే వారి శైలి నుంచి వాళ్ళు బయట పడాలి, మనం వాళ్ళ ప్రతిభ కొత్త తరహాలో చూడాలి.
Labels:
Bapu,
Dasari,
Hitchkock,
K Viswanath,
Raghavendra Rao,
Ram Gopal Varma,
telugu
Sunday, January 20, 2013
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు లిపి -ద్వితీయ ఉత్తమ లిపి !!
తెలుగు భాషాభిమానులకు చాలా సంతోషకరమైన వార్త
ఈనాడు వారి "తెలుగు వెలుగు" మాస పత్రిక తాజా సంచికలో వచ్చిన " అమ్మ సిగలో మరో కలికితురాయి " అనే కథనం ప్రకారం:
ఇటీవల ( 2012 అక్టోబర్ 1 నుంచి 4 వరకు ) థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన "రెండవ ప్రపంచ లిపుల సదస్సు" లో మన తెలుగు లిపి "ద్వితీయ ఉత్తమ లిపి" గా ఎంపిక అయింది. మొదటి స్థానం కొరియా భాషకు వచ్చింది.
ముప్పై మూడు దేశాల నుంచి ప్రతినిధులు అనేక భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇందులో పాల్గొనగా మన తెలుగు భాష కు ప్రతినిధి గా మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ (డాక్టర్) మాడభూషి సంపత్ కుమార్ హాజరయ్యారు.
మన లిపి కి ఈ పురస్కారం రావడానికి కారణాలు:
- సౌకర్యవంతమైన లిపి.
- ఉచ్ఛారణ విధేయత
- వీలైనన్ని ధ్వనులను రాయడానికి గల సామర్ధ్యం.
- నేర్చుకోవడం సులభం.
- అందమైన లిపి.
ఐతే మనం మొదటి స్థానం సంపాదించక పోవడానికి కారణం " ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి అనుకూలంగా లేకపోవడం" అని, ఆ కారణంగానే కొరియా భాష మొదటి స్థానం సాధించింది అని అర్ధమవుతుంది.
ఏది ఏమైనా ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ విషయాన్ని మనం తగినంత ప్రచారంతో ప్రజలలోకి తీసుకు వెళితే
కొత్త తరంలోని తెలుగు వారికి భాష నేర్చుకోవడానికి, రాయడానికి స్ఫూర్తి కలిగిస్తుందేమో.
ఈ లింకు చూడండి :
http://rki.kbs.co.kr/english/news/news_zoom_detail.htm?No=6901
Thursday, January 17, 2013
Tuesday, June 7, 2011
నిలువెత్తు నిర్లక్ష్యం
అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో
మహనీయులకు మరొక సారి అవమానం
ఆందోళన కారుల చేతిలో పూర్తిగా ధ్వంసమైన విగ్రహాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. కనీసం ఆనవాలు లేకుండా నీటి పాలై, ఆ మహనీయుల పరువు నిలిపాయి.
కాని, ఈ విగ్రహం అత్యంత హేయమైన, నీచమైన, అనాగరికమైన నిర్లక్ష్యానికి గురయ్యింది. మార్చ్ 10 వ తేదీ .. ఇదే విగ్రహం నడి రోడ్డు మీద పడిఉంది. ఆ తర్వాత రెండు రోజులు ట్యాంక్ బండ్ మధ్య మలుపు లో పేవ్ మెంట్ మీద (మెడ కు ఉరి తాడుతో సహా అలాగే) గడిపడం నేను చూసాను. ఆ తర్వాత కొన్ని దిన పత్రికల్లో వచ్చిన విమర్శలతో, ప్రభుత్వ అధికారులు ఈ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణానికి తరలించారు. అక్కడ ఈ ఫోటో లో ఉన్న స్థితి లో, మూత్ర శాలల నడుమ, చాల రోజులనుంచి ఉన్నట్టు ఇది వరకే, ఇంకొక దిన పత్రికలో చదివాను.
మనకు మహనీయుల విగ్రహాలు ఎందుకు? వారికి కనీస గౌరవం ఇవ్వలేని ప్రజలు, ప్రభుత్వాలు ఉన్నంత కాలం మన తెలుగు వెలుగుల గతి ఇంతే. ఇతర భాషల వాళ్ళు, వారి మహనీయులని ఇలాగే "గౌరవిస్తున్నారా"?
మన సాంస్కృతిక శాఖ వారి పని తీరుకు మరొక్క సారి నా జోహార్లు. దయ చేసి మళ్లీ కొత్త విగ్రహాలు చేయించి కొత్త అవమానాలు చేయకండి.
Thursday, May 26, 2011
Friday, October 8, 2010
రోబో- నా సొంత రివ్యూ

రోబో ఇప్పటికే ప్రపంచమంతా సంచలనాలు సృష్టిస్తోంది... కొత్తగా చెప్పడానికి ఏమి లేకుండా వ్యూలు, రివ్యూలు వచ్చేశాయి.
కాని నా కంటితో చూసి నా సొంత రివ్యూ రాస్తే ఎలా వుంటుంది అనుకున్నా. అది ఇలా ఉంది.
రోబో కి స్వంత తెలివి, ఆలోచన, విచక్షణ, స్పందన, సందర్భోచిత ప్రవర్తన ఉండవు కాబట్టి అవి ఎన్నటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేవు... ఒక వేళ అటువంటి తెలివిని వాటిలో ప్రవేశ పెట్టినా ఆ ప్రయత్నం వినాశనానికి దారి తియ్యొచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పనిలో పనిగా మనుషుల్లో కూడా తెలివి వికటిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని దర్శకుడు కన్వే చేసాడు. తనను సృష్టించిన "దేవుడికి" ద్రోహం చెయ్యడానికి ఒక రోబో ప్రయత్నం, అందువల్ల కలిగిన విధ్వంసం, హీరో తన సృష్టిని తన నియంత్రణ లోకి ఎలా తెస్తాడు అనే విషయాలను దర్శకుడు తన ప్రతిభ, సాంకేతిక నిపుణుల సామర్ధ్యం, నటీనటుల నట పాటవం తో ఎంతో అందంగా భారీ గా తెరకి ఎక్కించాడు.
ఇంతకంటే వివరాలు మీకు చెప్పకుండా డైరెక్ట్ గా విషయానికొస్తే ...
రోబో మూవీ రజనికాంత్ తప్ప వేరొకరు చేస్తే ? సినిమాలో ఈ రకమైన ఫీల్ ఉండేది కాదు. ఇంత డిమాండ్ ప్రపంచమంతా ఉండేది కాదు. ఇంత ఖర్చుకు తగ్గ రాబడి పూర్తిగా అనుమానమే !! అందుకే, ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్.
![]() |
| ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్ |
రెహ్మాన్ సంగీతం : అంత గొప్పగా లేదు. సినిమా స్థాయికి తగ్గ పాటలు, BG మ్యూజిక్ లేవు.
సాంకేతికంగా ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. భారతీయ సినిమాల స్టాండర్డ్ ప్రకారం ఇందులో చూపిన గ్రాఫిక్స్, టెక్నిక్, మిక్సింగ్ ఎంతో ఉన్నత స్థాయి లో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరింది. కానీ Terminator 2 , I Robo లాంటి సినిమాలు చుసిన వాళ్లకు మనం ఇంకా చాలా వెనక బడినట్టు అనిపించడం సహజం.
మొత్తానికి రజని presence , హ్యూమన్ టచ్ , కళ్ళు మిరుమిట్లు కొలిపే గ్రాఫిక్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి.
Verdict : ఒక సారి చూడొచ్చు.
Tuesday, October 5, 2010
నోబెల్ బదులు.... నవ్వులపాలు!!
నేను ఎంతో ఆలోచించి నా బ్లాగ్ కి THINK DIFFERENT అని పేరు పెట్టాను.
కాని డిఫరెంట్ గా థింక్ చేస్తే మన దేశం లో ఎలాంటి మర్యాద దొరుకుతుందో ఈ రోజే తెలిసింది.
ఈ క్లిప్పింగ్ చూడండి...
(Courtesy : Andhra Jyothi Newspapaer dated 05.10.2010)
నిజానికి ఇది ఎప్పుడో జరిగిన కథ. నోబెల్ బహుమతి సాధించ డానికి అన్ని అర్హతలూ ఉన్న ఒక డాక్టర్ జీవితం ఎలా విషాదాంతం అయిందో చదివితే కళ్ళు చెమరుస్తాయి.
West Bengal లో కమ్యునిస్ట్ ప్రభుత్వం మూర్ఖపు నమ్మకాలకు ఊతమివ్వదని ఇన్నాళ్ళూ పొరబడ్డాను. ఎక్కడైనా నాయకులు అధికారులు ఇంతేనేమో!!
డాక్టర్ ముఖోపాధ్యాయ కు సముచిత గుర్తింపు ఆయన బ్రతికుండగానే ఇచ్చి వుంటే ఆయన ఇంకా ఎంతో సాధించి మన దేశానికి పేరు తెచ్చి ఉండే వారేమో ! బహుశా నోబెల్ బహుమతి కూడా షేర్ చేసుకునే వారేమో!
>>అంధ్రజ్యోతి పూర్తి కధనం<<
మన 'బ్రహ్మ'కు మరణ శాసనం
ఈ ప్రపంచపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూసీ బ్రౌన్! పుట్టింది 1978 జూలై 25న, బ్రిటన్‌లో!
మరి రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
ఆ అమ్మాయి పేరు దుర్గ, పుట్టింది 1978 అక్టోబర్ 3న, కోల్‌కతాలో!
ఔను... ఇది నిజం!
బ్రిటన్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన 67 రోజులకే... భారత్‌లో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టింది. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ ఈ విజయం సాధించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన తాను సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటారు.
కానీ... ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. పైగా.. ఆయనను వెలివేసినట్లుగా చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమూ ఆయన పరిశోధనను గౌరవించలేదు. భారత ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి... తన పరిశోధన పత్రాలను జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రవేశపెట్టేందుకు వెళతానని నెత్తీ నోరూ బాదుకుని ప్రాధేయపడినా అనుమతి నిరాకరించారు.
దీంతో డాక్టర్ ముఖోపాధ్యాయ 1981 జూన్ 19న కోల్‌కతాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు! ఇదీ.. ఒక మహా శాస్త్రవేత్తకు మన దేశంలో లభించిన గౌరవం! ముఖోపాధ్యాయ విషాదాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 'ఏక్ డాక్టర్‌కీ మౌత్' (ఒక వైద్యుడి మరణం) పేరిట సినిమా కూడా తీశారు.
బ్రిటన్‌లో డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టెప్టోయ్‌లు కృత్రిమ గర్భధారణపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే... భారత్‌లో ముఖోపాధ్యాయ ఇదే అంశంపై దృష్టి సారించారు. కృత్రిమ గర్భధారణ విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారానే 'దుర్గ' అలియాస్ కానూప్రియ అగర్వాల్ జన్మించింది.
అయితే... ముఖోపాధ్యాయ విజయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... ఐవీఎఫ్‌పై తదుపరి పరిశోధనలు చేయకుండా అడ్డుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై విచారణకు ఆదేశించింది. ఆధునిక పునరుత్పాదక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారెవరూ ఈ కమిటీలో లేరు. దీంతో... ఉపాధ్యాయుడిని ఒకటో తరగతి పిల్లాడు ప్రశ్నించినట్లుగా ఈ దర్యాప్తు తయారైంది.
ఈ పిండాలను మీరు ఎక్కడ పెట్టారు? యాంప్యూల్ (తొలి దశలో పిండాన్ని ఉంచే ట్యూబు)కు ఎలా సీలు వేశారు? సీలు వేసేటప్పుడు పిండం చనిపోదా? ఇలాంటి అవగాహనలేని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖోపాధ్యాయ చెప్పిన సమాధానాలు వారి బుర్రకు ఎక్కలేదు. చివరికి... కృత్రిమ గర్భధారణలో విజయం సాధించానన్న ఆయన ప్రకటన ఉత్తి బోగస్ అని కమిటీ సభ్యులు తేల్చారు.
స్వదేశంలో ఎలాగూ గుర్తింపు లభించలేదు, కనీసం విదేశాలకైనా వెళ్లి తన పరిశోధన పత్రాలను సమర్పించాలని ముఖోపాధ్యాయ భావించారు. కానీ... కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. జపాన్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు... ఆయన సాధించిన విజయం కూడా సమాధి అయింది.
ఎలా బయటపడిందంటే...
1986 ఆగస్టు 16న పుట్టిన హర్షయే భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని, ఐఆర్ఆర్ డైరెక్టర్ టి.సి.ఆనంద్ కుమార్ ఈ విజయం సాధించారని రికార్డుల్లో నమోదైంది. ఆనంద్ కుమార్ 1997లో 'సైన్స్ కాంగ్రెస్'లో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు కలిశారు. 'మీకంటే చాలా ముందే డాక్టర్ ముఖోపాధ్యాయ టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించారు.
ఈ పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది' అని ముఖోపాధ్యాయ రూపొందించిన పరిశోధన పత్రాలను ఆనంద్ కుమార్‌కు అప్పగించారు. ఈ పత్రాలను ఆనంద్ కుమార్ నిశితంగా పరిశీలించారు. భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించింది తాను కాదని, ఈ ఘనత ముఖోపాధ్యాయకే చెందుతుందని ఆయన తేల్చారు.
దీంతో ప్రభుత్వం కూడా రికార్డులు తిరగరాసింది. భారత తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ 'దుర్గ' అని, ఇది ముఖోపాధ్యాయ సాధించిన విజయమని నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఆమె తనను సృష్టించింది ముఖోపాధ్యాయేనని మరోసారి ప్రకటించారు.
కాని డిఫరెంట్ గా థింక్ చేస్తే మన దేశం లో ఎలాంటి మర్యాద దొరుకుతుందో ఈ రోజే తెలిసింది.
ఈ క్లిప్పింగ్ చూడండి...
(Courtesy : Andhra Jyothi Newspapaer dated 05.10.2010)
నిజానికి ఇది ఎప్పుడో జరిగిన కథ. నోబెల్ బహుమతి సాధించ డానికి అన్ని అర్హతలూ ఉన్న ఒక డాక్టర్ జీవితం ఎలా విషాదాంతం అయిందో చదివితే కళ్ళు చెమరుస్తాయి.
West Bengal లో కమ్యునిస్ట్ ప్రభుత్వం మూర్ఖపు నమ్మకాలకు ఊతమివ్వదని ఇన్నాళ్ళూ పొరబడ్డాను. ఎక్కడైనా నాయకులు అధికారులు ఇంతేనేమో!!
డాక్టర్ ముఖోపాధ్యాయ కు సముచిత గుర్తింపు ఆయన బ్రతికుండగానే ఇచ్చి వుంటే ఆయన ఇంకా ఎంతో సాధించి మన దేశానికి పేరు తెచ్చి ఉండే వారేమో ! బహుశా నోబెల్ బహుమతి కూడా షేర్ చేసుకునే వారేమో!
>>అంధ్రజ్యోతి పూర్తి కధనం<<
మన 'బ్రహ్మ'కు మరణ శాసనం
రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ సృష్టికర్త భారతీయుడే
1978లోనే పరిశోధనలు
ముఖోపాధ్యాయ విజయాన్ని గుర్తించని బెంగాల్ ప్రభుత్వం
విచారణ పేరిట వేధింపులు
జపాన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుపుల్ల
నిరాశా నిస్పృహలతో ముఖోపాధ్యాయ ఆత్మహత్య
ఆలస్యంగా లభించిన గుర్తింపు
ముఖోపాధ్యాయ విజయాన్ని గుర్తించని బెంగాల్ ప్రభుత్వం
విచారణ పేరిట వేధింపులు
జపాన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుపుల్ల
నిరాశా నిస్పృహలతో ముఖోపాధ్యాయ ఆత్మహత్య
ఆలస్యంగా లభించిన గుర్తింపు
మరి రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
ఆ అమ్మాయి పేరు దుర్గ, పుట్టింది 1978 అక్టోబర్ 3న, కోల్‌కతాలో!
ఔను... ఇది నిజం!
బ్రిటన్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన 67 రోజులకే... భారత్‌లో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టింది. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ ఈ విజయం సాధించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన తాను సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటారు.
కానీ... ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. పైగా.. ఆయనను వెలివేసినట్లుగా చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమూ ఆయన పరిశోధనను గౌరవించలేదు. భారత ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి... తన పరిశోధన పత్రాలను జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రవేశపెట్టేందుకు వెళతానని నెత్తీ నోరూ బాదుకుని ప్రాధేయపడినా అనుమతి నిరాకరించారు.
దీంతో డాక్టర్ ముఖోపాధ్యాయ 1981 జూన్ 19న కోల్‌కతాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు! ఇదీ.. ఒక మహా శాస్త్రవేత్తకు మన దేశంలో లభించిన గౌరవం! ముఖోపాధ్యాయ విషాదాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 'ఏక్ డాక్టర్‌కీ మౌత్' (ఒక వైద్యుడి మరణం) పేరిట సినిమా కూడా తీశారు.
బ్రిటన్‌లో డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టెప్టోయ్‌లు కృత్రిమ గర్భధారణపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే... భారత్‌లో ముఖోపాధ్యాయ ఇదే అంశంపై దృష్టి సారించారు. కృత్రిమ గర్భధారణ విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారానే 'దుర్గ' అలియాస్ కానూప్రియ అగర్వాల్ జన్మించింది.
అయితే... ముఖోపాధ్యాయ విజయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... ఐవీఎఫ్‌పై తదుపరి పరిశోధనలు చేయకుండా అడ్డుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై విచారణకు ఆదేశించింది. ఆధునిక పునరుత్పాదక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారెవరూ ఈ కమిటీలో లేరు. దీంతో... ఉపాధ్యాయుడిని ఒకటో తరగతి పిల్లాడు ప్రశ్నించినట్లుగా ఈ దర్యాప్తు తయారైంది.
ఈ పిండాలను మీరు ఎక్కడ పెట్టారు? యాంప్యూల్ (తొలి దశలో పిండాన్ని ఉంచే ట్యూబు)కు ఎలా సీలు వేశారు? సీలు వేసేటప్పుడు పిండం చనిపోదా? ఇలాంటి అవగాహనలేని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖోపాధ్యాయ చెప్పిన సమాధానాలు వారి బుర్రకు ఎక్కలేదు. చివరికి... కృత్రిమ గర్భధారణలో విజయం సాధించానన్న ఆయన ప్రకటన ఉత్తి బోగస్ అని కమిటీ సభ్యులు తేల్చారు.
స్వదేశంలో ఎలాగూ గుర్తింపు లభించలేదు, కనీసం విదేశాలకైనా వెళ్లి తన పరిశోధన పత్రాలను సమర్పించాలని ముఖోపాధ్యాయ భావించారు. కానీ... కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. జపాన్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు... ఆయన సాధించిన విజయం కూడా సమాధి అయింది.
ఎలా బయటపడిందంటే...
1986 ఆగస్టు 16న పుట్టిన హర్షయే భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని, ఐఆర్ఆర్ డైరెక్టర్ టి.సి.ఆనంద్ కుమార్ ఈ విజయం సాధించారని రికార్డుల్లో నమోదైంది. ఆనంద్ కుమార్ 1997లో 'సైన్స్ కాంగ్రెస్'లో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు కలిశారు. 'మీకంటే చాలా ముందే డాక్టర్ ముఖోపాధ్యాయ టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించారు.
ఈ పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది' అని ముఖోపాధ్యాయ రూపొందించిన పరిశోధన పత్రాలను ఆనంద్ కుమార్‌కు అప్పగించారు. ఈ పత్రాలను ఆనంద్ కుమార్ నిశితంగా పరిశీలించారు. భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించింది తాను కాదని, ఈ ఘనత ముఖోపాధ్యాయకే చెందుతుందని ఆయన తేల్చారు.
దీంతో ప్రభుత్వం కూడా రికార్డులు తిరగరాసింది. భారత తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ 'దుర్గ' అని, ఇది ముఖోపాధ్యాయ సాధించిన విజయమని నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఆమె తనను సృష్టించింది ముఖోపాధ్యాయేనని మరోసారి ప్రకటించారు.
Sunday, September 19, 2010
బహుదూరపు బాటసారి
Saturday, September 18, 2010
దారి తప్పిన న్యాయ-వాదం
ప్రతి శనివారం ఆంద్ర జ్యోతి దిన పత్రిక లో ఆదిత్య పేరుతొ కొన్ని వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి. చదువుతున్నారా?
ఈ రోజు ప్రచురించిన వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. మీరూ చదవండి.
దారి తప్పిన న్యాయ-వాదం
- ఆదిత్య
రాష్ట్రంలో గతవారం రోజులుగా, ముఖ్యంగా గడచిన మూడు రోజులుగా హైకోర్టు ఆవరణలో చోటు చేసుకు న్న సంఘటనలను గమనిస్తే, భవిష్యత్తులో పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో ఊహించుకోవాలంటేనే భయం వేస్తున్నది. ప్రస్తుతం జరిగిన సంఘటనలకు కారణమైన వారు తాత్కాలికంగా ప్రయోజనం పొందుతూ ఉండవచ్చు. కానీ, తాము ఈరోజు నెలకొల్పిన సంస్కృతి, రేపు తమ మెడకు చుట్టుకోబోతున్నదన్న వాస్తవాన్ని వారు గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
ఉద్యమకారులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవరైనా వాదిస్తే చేయగలిగింది ఏమీ లేదు. కానీ, ఇవ్వాల్టి మన చర్యలను భవిష్యత్తులో ఉద్యమాలు చేసే వాళ్లు ఆదర్శంగా తీసుకుంటే? ఇవ్వాళ ఉద్యమకారులుగా ఉన్న వాళ్లు, రేపు అధికారంలో ఉండవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అని ఆలోచించుకుని విజ్ఞతతో వ్యవహరించవలసిన బాధ్యత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారిపై కచ్చితంగా ఉంది.
తెలంగాణ సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుని ఏమి మాట్లాడి నా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం అవివేకమే అవుతుంది. విద్వేషాలు పెంచి పోషించడం ఎవరికైనా సులువే. కానీ, మన పూర్వీకులు నిర్మించిన వ్యవస్థలను, సంప్రదాయాల ను విధ్వంసం చేస్తే, వాటిని పునరుద్ధరించడం అంత తేలికైన విషయం కాదు. ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టడం ఎవరైనా చేయగలరు. కానీ, ఆవేశాలకు దూరంగా, ఆలోచనతో వ్యవహరించేలా ప్రజలకు నాయకత్వం వహించే వాళ్లే నిజమైన నాయకులు గా మిగులుతారు.
అయితే, జరుగుతున్న పరిణామాలు అందు కు భిన్నంగా ఉంటున్నాయి. ఎరువుల కొరత సమస్యపై ధర్నా చేయడానికి మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి చేయడం, కరీంనగర్ జిల్లాలోని ములకనూరు సహకార సొసైటీ పనితీరును పరిశీలించడానికి వెళ్లిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిపై దాడికి పూనుకోవడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉండవచ్చు. సీమాంధ్రకు చెందిన వాళ్లన్న పేరిట ఎవరినీ తెలంగాణలో తిరగనివ్వబోమనడం సమర్థనీయం కాదు. ఈరెండు సంఘటనల వెనుక రాజకీయ వ్యూహాలు ఉండి ఉండవచ్చు. కానీ, హైకోర్టులో జరిగిన సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.
ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వంటి పదవులలో 42 శాతం పోస్టులను, తెలంగాణ వారితోనే భర్తీ చేయాలని కోరు తూ తెలంగాణ న్యాయవాదులు ప్రారంభించిన ఉద్యమం శ్రుతి మించి న్యాయ వ్యవస్థనే ఆత్మ రక్షణలో పడవేసింది. ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోయిన పలువురు తెలంగాణ న్యాయవాదు లు, తాము దైవంగా భావించవలసిన కోర్టు హాళ్లలోకి జొరబడి, న్యాయమూర్తులను, సీమాంధ్ర న్యాయవాదులను బండబూతులు తిట్టడం ఎంతవరకు సమర్థనీయం!
మూడు రోజులపాటు హైకోర్టులో అరాచక పరిస్థితులు నెలకొన్నా, సెలవులో వెళ్లిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తిరిగి వచ్చి తగు ఆదేశాలు ఇచ్చే వరకు, పరిస్థితులను చక్కదిద్దడానికి ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మీనాకుమారి గానీ, ఇతర సీనియర్ న్యాయమూర్తులుగానీ ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? న్యాయవాదుల చర్యల వల్ల నష్టం ఎవరికి? ప్రభుత్వం పరిష్కరించవలసిన సమస్యను, హైకోర్టు ఆవరణలో, కోర్టు హాళ్లలో పరిష్కరించాలని కోరడంలోని ఔచిత్యం ఏమిటి? ఇలాంటి మరె న్నో ప్రశ్నలకు అటు తెలంగాణ న్యాయవాదులు, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన తెలంగాణ ఉద్యమ నాయకులు, ఇటు న్యాయమూర్తులు సమాధానం చెప్పవలసి ఉంది.
జరిగిన సంఘటనలకు మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి, శుక్రవారం నాడు రాజీనామాను ఉపసంహరించుకోవడానికి ససేమిరా అనడాన్ని గమనిస్తే, ఈ సంఘటనల వల్ల ఏర్పడిన గాయం ఇప్పట్లో మానుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. జస్టిస్ నాగార్జున రెడ్డి రేపోమాపో తన రాజీనామాను ఉపసంహరించుకోవచ్చు.
కానీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, రాగ ద్వేషాల కు తావులేని రీతిలో వ్యవహరించడం ద్వారా గౌరవం పొందవలసిన న్యాయమూర్తులనే, ప్రాంతాల వారీగా టార్గెట్ చేయడానికి వారి ప్రవర్తనే కారణమా? న్యాయవాదుల అరాచకం కారణ మా? ఏకంగా కోర్టు హాళ్లలోకే జొరబడి, న్యాయమూర్తులనే దూషించే ధైర్యం న్యాయవాదులకు ఎలా వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ సందేహాలకు ముందుగా సమాధానాలు అన్వేషించవలసి ఉంది.
వ్యవస్థలను కుప్పకూల్చుకుంటూ పోవడం వల్ల ఏమి జరుగుతుందో ఇప్పుడు మన హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులకు అర్థమై ఉంటుంది. తెలంగాణ న్యాయవాదులకూ ఈ సంగతి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా కాకుండా, కుల, మత, ప్రాంతాల వారీగా విడిపోయి, రాజకీయ రంగు కూడా వేసుకోవడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇప్పుడున్న పరిస్థితులలో హైకోర్టు ఎలా పనిచేస్తున్న ది? ఆయా వ్యాజ్యాల్లో అనుకూల ఉత్తర్వులు రావడానికి న్యాయవాదులు చేసే వాదనలు మాత్రమే సరిపోతున్నా యా? వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.
న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఎప్పటి నుంచో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఇటీవలి కాలం లో పెరిగిపోయాయి. ఆదర్శంగా వ్యవహరించవలసిన న్యాయమూర్తులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు శాంపిల్‌గా మాత్రమే తెలిసింది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా ఉండబోతున్నాయి. కోర్టు హాళ్లలోకి చొచ్చుకు వచ్చి కోర్టుల పనిని అడ్డుకున్న న్యాయవాదులను నిలువరించలేని నిస్సహాయస్థితిలో జస్టిస్ మీనాకుమారి ఎందుకు ఉండిపోయారో ఆమె సమాధా నం చెప్పవలసి ఉంటుంది.
పదోన్నతుల ఆరాటం నుంచి న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాకపోవడం శోచనీ యం. ఇవ్వాళ జస్టిస్ నాగార్జునరెడ్డికి జరిగిన అవమానం, రేపు మరెవరికైనా జరగవచ్చు. అయితే, తమ ముందు అత్యంత వినయంగా 'మిలార్డ్' అంటూ సంబోధిస్తూ కేసులు వాదించే న్యాయవాదులకు, తమను దూషించే తెంపరితనం ఎందుకు వచ్చిందో ముందుగా న్యాయమూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన, నడవడికను బట్టి ఎదుటి వాళ్లు మనల్ని గౌరవిస్తారన్న నానుడి ఉండనే ఉంది.
ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో హైకోర్టు న్యాయమూర్తులకే కాదు; మొత్తం దేశంలోని న్యాయ వ్యవస్థకే తెలిసి వచ్చేలా ఈ సంఘటనలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పని తీరులో అవాంఛనీయ పోకడలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. మనం ఎంతకాలం, ఏ పదవిలో ఉన్నామన్న విషయం కాదు. ఎంత ఆదర్శంగా విధులు నిర్వహించామన్నది ముఖ్యమన్న విషయాన్ని న్యాయమూర్తులకు గుర్తు చేయడం సాహసమే అవుతుంది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన న్యాయవాదులను నిలువరించే 'మోరల్ అథారిటీ' మన న్యాయమూర్తుల కు లేదా? ఉందో లేదో ఆయా న్యాయమూర్తులే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఇక న్యాయవాదుల విషయానికి వద్దాం. న్యాయాధికారుల పోస్టుల్లో 42శాతం కోటా కావాలని తెలంగాణకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేయడంలో ఆక్షేపణ ఏమీ లేదు. జనాభాలో వాటా (ఫెయిర్ షేర్) ప్రాతిపదికగా తమకు పోస్టు లు కేటాయించాలని వారు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే. ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ కావాలని కూడా డిమాండ్ చేయవచ్చు. కానీ ఆ డిమాండ్ సాధనకు వారు ఎంచుకున్న మార్గమే అత్యంత అభ్యంతరకరమైనది.
42 శాతం పోస్టులు ఇవ్వాల్సింది ఎవరు? ఆందోళన ఎక్కడ జరిగింది? అన్నదే ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న, ఈ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డిమాండ్ సాధనకు అనుసరించిన విధానం సమర్థనీయమేనా అని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యాయవాదులకు మద్దతు ప్రకటించిన నాయకులు కూడా ఈ విషయంలో సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది.
తెలంగాణ ఏర్పా టు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని, న్యాయవాదుల డిమాండ్ ను వేర్వేరుగా చూడవలసి ఉంటుంది. లా ఆఫీసర్ల నియామకాల్లో 42 శాతం కోటా తెలంగాణ న్యాయవాదులకు దక్కకపోయి ఉండవచ్చు. అలా ఇప్పుడే జరిగిందా? ఇంతకు ముందు అన్యాయం జరగ లేదా? అనేది తేలవలసి ఉంది. ఇంతకు ముందు నుంచే ఈ పరిస్థితి ఉండి ఉంటే, ఇంత విధ్వంసకరంగా ఇప్పుడే ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇంతకంటే ముఖ్యమైన అంశం, ఈ డిమాండ్‌ను పరిష్కరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం.
హైకోర్టు చేయగలిగింది ఏమీ లేదు! పరిధిలో లేని అంశంపై హైకోర్టు ఆవరణలో విధ్వంసకాండకు పాల్పడే బదులు, సచివాలయంలోగానీ, ముఖ్యమంత్రి నివాస గృహం వద్ద గానీ, ధర్నాలు, దీక్షలకు దిగి ఉంటే ఆక్షేపించవలసింది ఏమీ ఉండదు. ఇందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించవలసి వచ్చిందో తెలంగాణ న్యాయవాదుల జె.ఎ. సి. నాయకులే చెప్పవలసి ఉంటుంది. తమ ఆవేదనను, ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాలని జె.ఎ.సి. నాయకులు చెబుతూ ఉండవచ్చు.
కానీ, సమాజంలో రోల్‌మోడల్‌గా వ్యవహరించ వలసిన న్యాయవాదులు, తమ ప్రవర్తన ద్వారా ప్రజల్లో గౌరవాన్ని పొందుతున్నారో, చులకన అవుతున్నారో ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న న్యాయవాదులే, ఆ రాష్ట్రంలో న్యాయమూర్తులుగా నియమితులు కావచ్చు. ఇవ్వాళ న్యాయమూర్తులను అవమానించిన వాళ్లు, రేపు న్యాయమూర్తులుగా నియమితులైతే, వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే? 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!' అని అప్పుడు న్యాయవాదులు ప్రశ్నిస్తే ఏమి సమాధా నం చెప్పగలరు? అలాగే గురువారం నాడు ఒక న్యాయవాది, తనపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
చట్టరీత్యా ఇది నేరం. ఈ సంగతి న్యాయవాదులకు తెలియనిది కాదు. ఇవ్వాళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ న్యాయవాదే, రేపు ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానో, గవర్నమెంట్ ప్లీడర్‌గానో నియమితులు కావచ్చు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున ఆయన వాదించవలసి రావచ్చు. తాను చేసింది తప్పు కానప్పుడు, ఇతరులు చేసింది తప్పని వాదించే నైతికత ఆ న్యాయవాదికి ఉంటుందా? ఈ చర్యలన్నీ తాత్కాలిక ప్రయోజనాలను లేదా ప్రచారాన్ని తెచ్చిపెట్టవచ్చు.
కానీ, మహోన్నతమైన సంప్రదాయాలను, చట్టాలను మనమే ఉల్లంఘిస్తే, జరగబోయే పరిణామాలకు మనం కూడా బలవుతామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవలసి ఉంది. న్యాయం కోసం వచ్చే వారిని అక్కున చేర్చుకుని, న్యాయాన్ని అందివ్వవలసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమే, ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అటు న్యాయమూర్తుల కు, ఇటు న్యాయవాదులకు కూడా ప్రవర్తనా నియమావళి ఉంటుంది. ఎవరికి వారు దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది.
న్యాయ వ్యవస్థలో కూడా ప్రాంతీయ వైషమ్యాలు చొరబడ్డ తీరు చూస్తే ఎవరికైనా మనసు వికలం కాకమానదు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న నాయకులు, సంఘాల ప్రతినిధు లు, అటు సమైక్యాంధ్ర కావాలంటూ హడావుడి చేస్తున్న నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నారో స్పష్టం చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉండవచ్చు. లేదా రెండు రాష్ట్రాలు కావచ్చు. లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.
అది నాయకుల సమస్య మాత్రమే కాదు. ప్రజల సమస్య! రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం సరైన విధానం కాదు. దీనివల్ల అమాయక ప్రజలు నలిగిపోతారన్న వాస్తవాన్ని గుర్తించి, నాయకులు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకోవడం అత్యాశ కాకూడదు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లితే ఎవరికి మాత్రం సుఖం మిగులుతుంది?! సమస్య కానిది సమస్యగా మారకూడదు.
ఉద్యమ నాయకులకు గానీ, తెలంగాణ ఉద్యమ నేతలకు గానీ, సమైక్య వాదన వినిపించే నాయకులకు గానీ, ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవుతాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఆ కారణంగానే సెంటిమెంట్ గ్రామ స్థాయి వరకు బలంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ ఏర్పడినా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులువు కాదన్న వాస్తవాన్ని ఉద్యమ నాయకులు గుర్తించి, ఇప్పటి తమ చర్యలు మున్ముందు తమకే ఎదురుకొట్టకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది.

Tuesday, September 14, 2010
ఈ ఫోటో ఎవరిదో తెలుసా ?
![]() | |
| గుర్తు పట్టారా ? |
![]() |
| ఇంకా తెలియ లేదా? |
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా. నందమూరి తారక రామారావు
.
Saturday, August 14, 2010
కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మళ్లీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు పణంగా పెట్టిన యోధులని స్మరించుకునే రోజు వచ్చింది.
మొక్కుబడిగా "వేడుకలు" జరుపుకుని
టీవీ లో సినిమాలు చూస్తూ కొందరు,
మందు కొడుతూ కొందరు,
నిద్ర పోతూ కొందరు గడిపే రోజు వచ్చింది.
నిన్న రాత్రి 11 గంటలకు పంజాగుట్ట సెంటర్ లో జోరున వర్షంలో
ఒక చిన్న కుర్రాడు జాతీయ జెండాలు అమ్ముకుంటు కనిపించాడు
మన దేశం సాధించిన "అభివృద్ది" కళ్ళ ముందు కనిపించింది.
కొద్ది రూపాయల కోసం, జోరున వర్షంలో పసివాళ్ళు అవస్థ పడడం
మన 64 ఏళ్ళ స్వరాజ్య పాలన ఫలం.
దీనికి కారకులయిన మన నాయకులకు మరొక్క సారి
వందనం చేద్దాం.
మహాకవి శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి
"స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరబాటోయి
కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి".
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు..
మనమే మన దేశానికీ పూర్వ వైభవం తెద్దాం..
చేతనైనంత మంచి చేద్దాం ..
జై హింద్
మళ్లీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు పణంగా పెట్టిన యోధులని స్మరించుకునే రోజు వచ్చింది.మొక్కుబడిగా "వేడుకలు" జరుపుకుని
టీవీ లో సినిమాలు చూస్తూ కొందరు,
మందు కొడుతూ కొందరు,
నిద్ర పోతూ కొందరు గడిపే రోజు వచ్చింది.
నిన్న రాత్రి 11 గంటలకు పంజాగుట్ట సెంటర్ లో జోరున వర్షంలో
ఒక చిన్న కుర్రాడు జాతీయ జెండాలు అమ్ముకుంటు కనిపించాడు
మన దేశం సాధించిన "అభివృద్ది" కళ్ళ ముందు కనిపించింది.
కొద్ది రూపాయల కోసం, జోరున వర్షంలో పసివాళ్ళు అవస్థ పడడం
మన 64 ఏళ్ళ స్వరాజ్య పాలన ఫలం.
దీనికి కారకులయిన మన నాయకులకు మరొక్క సారి
వందనం చేద్దాం.
మహాకవి శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి
"స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరబాటోయి
కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి".
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు..
మనమే మన దేశానికీ పూర్వ వైభవం తెద్దాం..
చేతనైనంత మంచి చేద్దాం ..
జై హింద్
Sunday, August 8, 2010
తెగులు తవిక - తెలుగు కవిత
శ్రీ కృష్ణ దేవ రాయలు పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక కవిత రాయాలని అనుకున్నా !
(Courtesy : ఈ రోజు ప్రసారమైన దూరదర్శన్ వారి కవి సమ్మేళనం)
కాని ఆ ప్రయత్నం బెడిసికొట్టి ఒక తవిక గా మారింది.
తప్పక చదవండి ...
తెలుగు కవిత : (Please read like Sri C Narayana Reddy)
కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి
కంద పద్యం రాయాలి ..వందల మంది చదవాలి ..
ఛందస్సు తెలియదు .. నా బొంద తెలియదు ... అయినా
కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి
ఉత్పలమాల లో ఉప్పొంగి పోయేలా ..
కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి
చంపకమాల లో చమక్కులు
మత్తేభంలో మ్యాజిక్కులు
హా అనిపించే హైకులు
అన్నీ కలగలిపి కవితా గోష్టి లో కలేజా చూపాలి
అహో ఆంధ్ర భోజా శ్రీ కృష్ణ దేవ రాయా ..!
నీవల్ల నాకు inspiration కలిగిందయా !!

Thursday, August 5, 2010
చట్టాలకు చుట్టాలు - మన ప్రియతమ నాయకులు
నా ఇష్టం .. ఎవరేమనుకంటె నాకేంటీ అనుకుని బహిరంగంగా పొగ త్రాగేవాళ్ళు మన దేశంలో కోకొల్లలు.బహిరంగ థూమపానం నిషేధించారని చాలామందికి ఇప్పటికీ తెలియదు. తెలిసినా అలవాటు మానుకోలేక ఎలాగోలా చాటుగా దమ్ము లాగిస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఇవన్నీ నాణానికి ఒక వైపు. మరొక వైపు మన నాయకులు....... చట్టాలను తయారు చేసే వారు అదే చట్టాలను ఎలా గాలికి వదులుతున్నారొ ఈ వార్త చదివితే అర్ధమవుతుంది. (ఈ రోజు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక లో ప్రచురితం అయింది.)
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఫొటొలో కనిపించిన ప్రజా ప్రతినిధి, తమ కార్యాలయంలో ఇలాంటి విషయాలను అనుమతించిన ప్రధానోపాధ్యాయులు కూడా శిక్షార్హులు. కాని ఎప్పటిలాగే ఎవరూ పట్టించుకోరు. అసలు ఇదీ ఒక పెద్ద విషయమేనా అనుకునేవాళ్ళు ఉండొచ్చు.
నాయకులకే చట్టాల పట్టింపు లేనప్పుడు మనకేం పట్టింది అనుకుంటాడు సామన్యుడు.. ఇక మన సమాజం బాగుపడేదెప్పుడో?
![]() |
| Anti smoking slogan by Ministry of Health and Family Welfare, Govt of India |
Thursday, July 29, 2010
ఆంద్ర రాష్ట్రం పై శ్రీ శ్రీ కవిత
ఆంద్ర రాష్ట్రం
రాలడానికి పండు కాదు
పండడానికి కాయ కాదు
కాయడానికి పువ్వు కాదు
పూయడానికి మొగ్గ కాదు
మొగ్గడానికి తేలు కాదు
తేలడానికి పాము కాదు
పామడానికి కాలు కాదు
కాలడానికి ఖర్మ కాదు
- శ్రీ శ్రీ
ఈ కవిత ఏ సందర్భంలో ఎందుకు చెప్పవలసి వచ్చింది ?
ఇందులో కవి హృదయం ఏమిటి తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది.
తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి ప్లీజ్.
Tuesday, March 30, 2010
నల్ల డబ్బు తెచ్చే ముప్పు ఇంతింత కాదయా
The Evils of Black Money on the Society :
ముందు ధియరీ కొంచెం చదవండి :
ముందు ధియరీ కొంచెం చదవండి :
నల్ల డబ్బు అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు అని చిన్న పిల్లాడికి సైతం అవగాహన ఉంది.కాని సరైన నిర్వచనం చెప్పాలంటే, ఆదాయపు / ఇతర పన్నులు కట్టని డబ్బు అని అర్ధం. మన దేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు లెక్క కట్టడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తర తరాలుగా నల్ల డబ్బు కూడగట్టిన కుటుంబాలు కోకొల్లలు. పన్ను ఎగగొట్టడం ఒక కళగా సాధన చేస్తున్నవారు ప్రభుత్వానికి అంత సులభంగా దొరకరు. మన అధికారులు కూడా చిన్న చిన్న కానుకలు స్వీకరించి "పోనీలే పాపం" అని వాళ్ళని వదిలేస్తుంటారు.
మామూలు గా అందరూ సక్రమంగా సంపాదించి అక్రమంగా పన్ను ఎగవేస్తుంటారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది.. అభివృద్ది పనులు జరగవు.
అయితే ఈ నల్ల డబ్బు కి మరొక ప్రమాదకరమైన పార్శ్వం ఉంది. అదే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన ధనం. ఈ రకమైన నల్ల డబ్బుచాలా ప్రమాదకరం. అది దేశ ఆర్ధిక వ్యవస్థనే కాకుండా పాలన వ్యవస్థని కూడా అస్థిర పరుస్తుంది. అంతే కాదు, ఆ డబ్బు మళ్ళీ చీకటి కార్య కలాపాలకు మళ్ళుతుంది. ఆ డబ్బుని నక్సలైట్స్, క్రిమినల్స్, ఇతర సంఘ వ్యతిరేక శక్తులు - తమ ఆయుధాలు సమకూర్చుకోవడానికి వాడే ఆవకాశం ఉంది. ఇంకా, రాజకీయ నాయకులు, వోట్ల కోసం నోట్లు పంచడానికి, కంట్రాక్టర్లు లంచాలు ఇవ్వడానికి వాడటం ఎలాగు ఉంటుంది.
ఇన్ని విధాలుగా మన వ్యవస్థ పై దుష్ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారిని ఏమి చేయ్యలేమా? ఆదాయపు పన్ను శాఖ వాళ్లకి, ఇతర ప్రభుత్వ విభాగాలకి దీనిని అరికట్టే శక్తి లేదా - అని ప్రశ్నించుకుంటే ఉందనే జవాబు వస్తుంది. ఎన్నో చట్టాలు, పద్ధతులు ( procedures ), నిఘా వ్యవస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. అవి సవ్యంగా పని చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ, మైనింగ్, లీగల్, సివిల్ కాంట్రాక్ట్, ఎక్సైజ్ మొదలైన వ్యవహారాల్లో నల్ల డబ్బు వాటా ఎక్కువ. కొద్దిపాటి జాగ్రత్త వహించి, కొంచెం నిజాయితీ చూపిస్తే, అధికారులు ఇలాంటి పన్ను ఎగవేత దారులని సులభంగా పట్టుకోవచ్చు. పాన్ నంబర్ గాని, మరేదైనా నంబర్ గాని తప్పనిసరిగా ప్రతి లావాదేవీలో వాడాలి అని ఉన్న నిబంధనని తు చ తప్పక పాటించాలి. భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తిగా కంప్యుటరైజ్ చెయ్యాలి. ఇలాంటి విషయాలలో ఎంత పారదర్శకత ఉంటె అంత తక్కువ అవినీతి, పన్ను ఎగవేత ఉంటాయి.
ఇక అసాంఘిక కార్యకలాపాలకు వాడే నల్ల డబ్బు పూర్తిగా భిన్నమైన దారిలో ప్రయాణిస్తుంది. వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకు రావడం, తమ వివరాలు ఇవ్వడం అనే సమస్య రాదు. హవాలా లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా లావాదేవీలు నడుస్తాయి. దీనిని అరికట్టడం ఆదాయపు పన్ను అధికారుల వల్ల అయ్యే పని కాదు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, నిజాయితీ కల అధికారులు, అప్రమత్తత ఉన్న పౌరులు ఇందుకు ఉపయోగ పడతారు.
ఇలా దాచిన డబ్బు చివరకు విదేశాల్లో తేలుతుంది, మన ఆర్ధిక వ్యవస్థకు శాపంగా పరిణమించిన ఈ సమస్య కు, ఆ దేశాల ప్రభుత్వాలు, బ్యాంకులతో అవగాహన కు రావడం కూడా అవసరం. కాని ఏ ప్రభుత్వం వచ్చినా తమ ఆస్తులు బయట పడతాయనే భయంతో ఇందుకు చిత్తశుద్ది తో ప్రయత్నించదు. చివరకు కోర్ట్ లు కలగా చేసుకోవాలి ఇందుకు కూడా !!
ఈ లింక్ చూడండి : నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే :
- మీరు దేశాన్ని ప్రేమించే వాళ్ళయితే నల్ల డబ్బు పోగు చెయ్యకండి
- మనం చెల్లించే ఆదాయపు పన్ను, ఇతర పన్నులు మన అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది అని మరిచిపోవద్దు.
- ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థ అనేది నేర మయమైన పునాదుల మీద నిర్మితమైంది - దానిని ప్రోత్సహించ వద్దు.
- రిజిస్ట్రేషన్ లాంటి వ్యవహారాలలో కొద్ది పాటి డబ్బు కలిసివస్తుందని అక్రమ పద్ధతులు అవలంబించకండి. లంచాలు ఇవ్వకండి. లంచం ఇవ్వమని ఎవరైనా అడిగితే అధికారులకు వాళ్ళని పట్టివ్వడానికి సహాయం చెయ్యండి.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే :
మేము ఒక్కళ్ళం నిజాయితీ గా ఉంటె, మేమే నష్ట పోతాం, మిగిలిన వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు అని చాలా మంది బాధ పడుతుంటారు. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో ప్రభుత్వం ఆలోచించాలి. మన నిజాయితీ మనకి చేటు తెస్తోంది అని అనుకునే ప్రజలున్నారంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమే. నిజాయితీ కి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఉన్నాయని, అవినీతి, అక్రమాలకి శిక్ష తప్పదని నిరూపించేలా తగిన చర్యలు తీసుకోవాలి.
ఈమధ్య హైదరాబాద్ మునిసిపాలిటి పరిధిలో ఆస్తి పన్ను కట్టిన వాళ్ళలో ఒకరికి లాటరి తీసి లక్ష రూపాయల బహుమతి నిచ్చారని వచ్చిన వార్త చూసి నేను ఎంతో సంతోషించాను. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఉత్సాహ పరుస్తాయి.
పూర్తి వివరాలకు :
మరొక వైపు, అవినీతి అధికారుల పై ACB అధికారుల దాడి కి కులపు రంగు పులిమి ప్రభుత్వం, ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా కొట్టుకున్న సంఘటన కూడా ఈ వారంలోనే జరిగింది. కులాల ప్రాతిపదిక పైనే అవినీతిని కూడా కొలిచే ఇలాంటి నీచమైన నాయకులు మన మధ్య ఉండగా ఇంక ఏం మంచి పనులు ఆశించగలం?
ముగింపు : మంచి నాయకత్వం, మంచి ప్రజలు, మంచి వ్యవస్థ కలిస్తేనే అవినీతి రహిత అభివృద్ది సాధ్యం.
Sunday, March 28, 2010
అమితాబ్ చేసిన తప్పేమిటి?
మహారాష్ట్ర లో ఏం జరుగుతోంది ?
బిగ్ బి కి జరుగుతున్నఅవమానాలు ఆయనకి కాదు యావత్ జాతికి జరుగుతున్న అవమానాలు గా భావించాలి.
దొంగలతో, అవినీతి పరులతో, ఇతర సంఘ వ్యతిరేక శక్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే రాజకీయ నాయకులు, అమితాబ్ తో ఒకే వేదిక మీద కూర్చోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ? అమితాబ్ చేసిన తప్పేమిటి?
పైకి గుజరాత్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడం ఒక కారణం గా ప్రచారం జరుగుతోంది. మరో వైపు సోనియా గాంధి కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య పెరుగుతున్న అగాధమే కారణం అని మీడియా కోడై కూస్తోంది.
కారణం ఏదైనా కావచ్చు. ఒక పౌరుడిగానైనా అమితాబ్ ను గౌరవించాలి కదా. ఆయనను అంటరాని వ్యక్తి అని డిక్లేర్ చెయ్యడం ఒకటే తక్కువ అన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎంత వరకు సబబు?
ఇంతలో మరొక న్యూస్, దేశ రాజధాని ఢిల్లీ లో అభిషేక్ పై కూడా ఆంక్షలు విధించినట్టు, ఆయన earth hour సందర్భం గా ఇచ్చిన మెసేజ్ ను ప్రదర్శించకుండా అడ్డుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదొక అంటు వ్యాధిగా వ్యాపించదని ఆశిద్దాం.
గుజరాత్ ప్రభుత్వం, భారత్ లో భాగం కాదా? ఒక పార్టీ , లేదా వర్గానికి చెందిన వారిని ఇలా సాంఘిక వెలి వేయడం (unless they are banned by the government) సరైన పని కాదు. ఆశ్చర్యకరంగా శివ సేన అధినేత ఇప్పుడు బచ్చన్ ను సమర్ధిస్తున్నారు. కాని అయన పార్టీ వారే అమితాబ్ పై కత్తి గట్టి కొద్ది రోజులే అయిందని మరిచిపోయారు.
మొత్తం మీద, తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా, ఎంతో disciplined జీవితం గడిపే అమితాబ్
కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడం చాలా బాధ కలిగిస్తోంది.
Subscribe to:
Posts (Atom)